![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -892 లో.. రిషి ఒంటరిగా కూర్చొని జగతి గురించి బాధపడుతుంటాడు. అప్పుడే చక్రపాణి రిషి దగ్గరికి వస్తాడు. జగతి మేడమ్ చాలా గొప్పవారు. మీరంటే తనకి బాగా ఇష్టం. మీతో ఉండాలి. తన ప్రేమని మీకు పంచాలని తాపత్రయపడింది. మీరు మీ అమ్మ ప్రేమని తెలుసుకొని దగ్గర అయి.. మీ అమ్మ మాట కోసం నా కూతురిని పెళ్లి చేసుకున్నారని రిషితో చక్రపాణి అంటాడు.
ఆ తర్వాత అదంతా చూస్తున్న దేవయాని వాళ్ళ దగ్గరకు వచ్చి.. మీకు ప్రేమ ఉన్నట్లు బాధ ఉన్నట్లు నటించకండని దేవయాని చక్రపాణితో దేవయాని అంటుంది. అలా అంటున్నారెందుకని చక్రపాణి అంటాడు. ఇంత వరకు మీ భార్య సుమిత్ర ఇక్కడికి రాలేదు. దాన్ని బట్టి ఏం అనుకోవాలి. మేం అంటే లెక్క లేదా? అసలు మీ భార్య ఎందుకు రావడం లేదు? పెళ్లికి కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏవేవో కారణాలు చెప్పారు. మీది అంత నటన అని దేవయాని అనగానే.. మీరు అలా అనకండి అని చక్రపాణి బాధతో అంటాడు. మరి ఎందుకు రావడం లేదని దేవయాని అడుగుతుంది. ఎందుకు అంటే తను లేదు. జగతి మేడం కంటే ముందే చనిపోయిందని చక్రపాణి చెప్తాడు. ఆ మాటలు విన్న రిషి షాక్ అవుతాడు. అవునా అసలు అలా ఎలా జరిగింది? నాకు ఎందుకు చెప్పలేదని రిషి అంటాడు. ఇప్పటికే బాధలో ఉన్న రిషి సర్ కి ఈ విషయం చెప్పి ఇంకా బాధపెట్టడం కరెక్ట్ కాదని నా కూతురు చెప్పనివ్వలేదు. నా పై సానుభూతి వద్దు ప్రేమ కావాలని మీరు ఇంటికి వచ్చినప్పుడు నా భార్య ఫోటో మీకు కన్పించకుండా ఉంచిందని రిషితో చక్రపాణి చెప్తాడు.
ఆ తర్వాత రిషి గదిలో ఉండగా వసుధార వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారు. మీరు మళ్ళీ కాలేజీకీ రావాలి. మీరు వస్తేనే మిషన్ ఎడ్యుకేషన్ బాగుంటుందని వసుధార అంటుంది. నాకు మా అమ్మ గుర్తుకు వస్తుందని రిషి అనగానే.. ఎప్పుడు అదే అలోచిస్తూ ఉండకండని వసుధార అంటుంది. అలా అనగానే తల్లి నీ పోగొట్టుకొని పైకి నవ్వుతు ధైర్యంగా ఉండడానికి నేను వసుధారని కాదని రిషి అనగానే వసుధార షాక్ అవుతుంది. నాకు అంత తెలిసింది. అసలేం జరిగిందని వసుధారని రిషి అడుగుతాడు. రిషికి వసుధార జరిగిందంతా చెప్తుంది. నువ్వు గ్రేట్ వసుధార. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తు నన్ను కాపాడుకుంటూ వస్తున్నావ్. మనం ఎప్పుడు కలిసే ఉండాలి. మనమెప్పుడు రిషిధారలమే అని వసుధార చేతిలో చెయ్యి వేసి రిషి మాటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |